కాకులకు ఐకమత్యమే బలం మరియు బలగం | Unity is strength and power for Crows |

23 days ago
28

కాకులకు ఐకమత్యమే బలం మరియు బలగం.

కాకులకు ఐకమత్యమే (unity) వాటి బలం బలగం. వాటి పిల్లల్ని కంటికి రెప్పల్లా కాపాడుకుంటాయి. చుట్టుపక్కల తమ పిల్లల్ని ఎత్తుకెళ్లే శత్రువు కనిపిస్తే కాకులు ఒక పట్టాన ఊరుకోవు. శత్రువుని మొదటగా చూసిన కాకి ఒక లాంటి శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని విని చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ క్షణంలో అన్నీ అక్కడికి చేరుకుంటాయి. ఆ శత్రువు చుట్టూ మూగి అరచి అరచి, విసిగిపోయి అది అక్కడినుంచి పారిపోయేదాకా సంఘటితంగా పోరాడతాయి. ఆవేశం ఎక్కువగా ఉండే కాకులు దానిమీద భౌతిక దాడికి కూడా పాల్పడతాయి. ఆ గొడవలో ఒక్కోసారి ప్రాణాలూ కోల్పోతాయి. కడుపు నిండి, ఖాళీగా ఉంటే ముచ్చట్లు పెడతాయి. తమకు తెలిసిన విషయాన్ని మిగిలినవాటితో పంచుకుంటాయి.

Unity is strength and power for Crows.

Unity is their strength for crows. They protect their children like an eye. Crows will not stay in one place if they see an enemy around who is carrying their young. A crow makes a similar sound when it first sees an enemy. Hearing that sound, all the crows around will reach there in an instant. They fight in unison until the enemy screams and shouts in silence and runs away. Angry crows will even physically attack it. Sometimes lives are lost in that fight. They share what they know with others.

Loading comments...